Quantum Energy Launches A New Variant Of Quantum Bziness For Commercial Deliveries - Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌ ఎనర్జీ సరికొత్త ఈ-స్కూటర్‌, ధర తక్కువే.. 130 కి.మీ. రేంజ్‌

Apr 6 2023 6:27 AM | Updated on Apr 6 2023 11:26 AM

Quantum Energy launches e-scooter for cargo deliveries - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల స్టార్టప్‌ క్వాంటమ్‌ ఎనర్జీ ‘క్వాంటమ్‌ బిజినెస్‌’ పేరుతో ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. వాణిజ్యపరమైన డెలివరీలకు ఈ వాహనం అనుకూలమని సంస్థ తెలిపింది. దీని ధర రూ.99,000 నుంచి ప్రారంభమవుతుంది. రుణ సదుపాయం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తోపాటు పలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

1,200 వాట్‌ మోటార్, గంటకు 55 కిలోమీటర్ల వేగం, ఒక్కసారి చార్జింగ్‌తో 130 కిలోమీటర్ల రేంజ్, రిమోట్‌ లాక్, అన్‌లాక్, యాంటీ థెఫ్ట్‌ అలారమ్, యూఎస్‌బీ చార్జర్, డిస్క్‌ బ్రేక్‌లు, ఎల్‌సీడీ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి.  మూడేళ్లు లేదా 99,000 కిలోమీటర్ల పాటు ఈ వాహనంపై సంస్థ వారంటీ ఆఫర్‌ చేస్తోంది. ఇందులో లిథియం అయాన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీ ఉపయోగించారు. (గుడ్‌ న్యూస్‌: యథాతథంగా కీలక వడ్డీరేట్లు)

Advertisement
 
Advertisement
Advertisement