రియల్టీలో పీఈ పెట్టుబడులు ఓకే | Sakshi
Sakshi News home page

రియల్టీలో పీఈ పెట్టుబడులు ఓకే

Published Mon, Apr 17 2023 5:22 AM

Pvt Equity inflow in real estate flat at 4. 2 billion Dollers in FY23 - Sakshi

న్యూఢిల్లీ: గత ఆర్ధిక సంవత్సరం(2022–23)లో దేశీ రియల్టీ రంగంలోకి 4.2 బిలియన్‌ డాలర్ల(రూ. 34,440 కోట్లు) ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో 22 శాతం నిధులను దేశీ ఇన్వెస్టర్లు అందించగా.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి 75 శాతానికిపైగా లభించాయి. కాగా.. అంతక్రితం ఏడాది(2021–22)లోనూ రియల్టీలోకి 4.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులే ప్రవహించాయి. వెరసి గతేడాది పీఈ పెట్టుబడులు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. మార్చితో ముగిసిన గతేడాదికి ఫ్లక్స్‌ పేరిట రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ క్యాపిటల్‌ విడుదల చేసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి.  

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ జోరు
మొత్తం రియల్టీ పెట్టుబడుల్లో ఢిల్లీ– ఎన్‌సీఆర్‌ మార్కెట్లోకి అత్యధికంగా 32 శాతం ప్రవహించాయి. ఇవి 2021–22తో పోలిస్తే 18 శాతం అధికం. కార్యాలయ ఆస్తులకు 40 శాతం పెట్టుబడులు లభించాయి. పెట్టుబడుల్లో చెన్నై వాటా 7 శాతం ఎగసి 8 శాతానికి చేరగా.. బెంగళూరు, హైదరాబాద్‌ సైతం అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో ఈక్విటీ మార్గం 80 శాతం నుంచి 67 శాతానికి నీరసించింది.

పెట్టుబడుల తీరిలా
2020–21లో దేశీ రియల్టీలోకి భారీగా 6.3 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు ప్రవహించాయి. అంతకుముందు అంటే 2019–20లో 6.3 బిలియన్‌ డాలర్లు, 2018–19లో 5.3 బిలియన్‌ డాలర్ల చొప్పున లభించడం గమనార్హం! గతేడాది పెట్టుబడుల్లో దేశీ ఇన్వెస్టర్ల వాటా 8% బలపడింది. 2021–22లో 14%గా నమోదుకాగా.. 2022– 23లో 22 శాతానికి ఎగసింది. రెసిడెన్షియల్‌ రియల్టీలో కార్యకలాపాలు వేగవంతం కావడంతో సగటు టికెట్‌ పరిమాణం 7.2 కోట్ల డాలర్లకు నీరసించింది. 2022లో 8.6 కోట్ల డాలర్లుగా నమోదైంది.

Advertisement
Advertisement