‘బిట్‌ బోర్డ్‌’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!

Portable Electronic Music Keyboard Having Wireless Connectivity Carry Anywhere - Sakshi

ఎలక్ట్రానిక్‌ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్‌ డిజైనర్‌ చెన్‌ సిన్‌ ఈ పరికరాన్ని ‘బిట్‌ బోర్డ్‌’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్‌ డాట్‌ డిజైన్‌ కాన్సెప్ట్స్‌’ పోటీల్లో ‘బెస్ట్‌ ఆఫ్‌ ద బెస్ట్‌’ అవార్డును కూడా సాధించారు.

ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్‌ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్‌ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్‌ ద్వారా వైర్‌లెస్‌ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్‌ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్‌లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. 

చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్‌ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్‌’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top