Playboy Model Ju Isen: రిచెస్ట్‌ జాబితాలో కుక్క: రూ.15 కోట్ల ఆస్తిని రాసిచ్చిన మోడల్‌

Playboy Model Ju Isen property Rs 15 crore to her pet dog Francisco - Sakshi

అత్యంత ధనవంతుల జాబితాలో మనుషులే కాదండోయ్‌..కుక్కలు కూడా చేరిపోతున్నాయి. ఇటీవల కాలంలో యజమానులు తాము పెంచుకున్న పెంపుడు కుక్కలకు కోట్ల ఆస్తిని తృణప్రాయంగా రాసిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే రిచెస్ట్‌ బిలియనీర్‌ డాగ్స్‌ జాబితాలో 'లులూ' అనే కుక్క ఉండగా.. ఇప్పుడు రిచెస్ట్‌ 'ఫ్రాన్సిస్కో' అనే మరో కుక్క చేరిపోయింది.

భవిష్యత్‌లో వరల్డ్‌ రిచెస్ట్‌ బిలినియర్స్‌ జాబితా తరహాలో వరల్డ్‌ రిచెస్ట్‌ డాగ్స్‌ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎందుకంటే మనుషులకి సమానంగా కుక్కలు సైతం ఆస్తుల‍్ని పోగేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజీలియన్‌కు చెందిన ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ (35) తాను సంపాదించిన ఆస్తి మొత్తం సుమారు రూ.15కోట్ల ప్రాపర్టీని ఫ్రాన్సిస్కో అనే కుక్కకు రాసిచ్చేసింది. ప్రస్తుతం అమెరికా పూస్‌ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటుంన్న జు ఐసెస్‌ తన అపార్టమెంట్లతో పాటు రెండు కార్లను కూడా కుక్కకే రాసిస్తానని ప్రకటించింది. ఇలా చేయడం ఎందుకు' అని అడిగిన లాయర్లకు ఆశ్చర్యపోయేలా రిప్లయ్‌ ఇచ్చింది. నాకు పిల్లలు లేరు. ఇప్పుడు బాగాన్నా..భవిష్యత్‌లో ఏదైనా అనార్ధం జరిగితే పరిస్థితి ఏంటీ? ముందు చూపు లేకపోతే ఎలా? అందుకే ఆస్తిని ఫ్రాన్సిస్కోకు రాసిస్తున్నా. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే..దాని కేర్ టేకర్ శ్రద్ధగా చూసుకుంటాడు' అని రిప్లయి ఇచ్చింది.       

ఇప్పుడే కాదు..గతంలో 
గతంలో అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్​విల్లేకు చెందిన బిల్​ డోరిస్ ప్రముఖ వ్యాపార వేత్త. బిజినెస్‌ చేసిన బిల్‌ డోరిస్‌ కోట్లు గడించాడు. పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. అందుకే తన ఆస్తి పాస్తులన్నీ (సుమారు 36కోట్లుకు పైమాటే) తన కుక్క లులూకి చెందేలా రాసిచ్చాడు. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న ఆ కుక్క ప్రపంచంలోనే రిచెస్ట్​ డాగ్ గా పేరు సంపాదించుకుంది. వీలునామా రాసి కుక్క కోసం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా తన స్నేహితుడు మార్తా బర్టన్ను నియమించాడు. అప్పట్లో ఈ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్గా మారింది.

చదవండి: వారెన్‌ బఫెట్‌ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబానీ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top