భారత మార్కెట్లో విడుదలైన వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్

Piaggio launches Vespa limited edition scooter for 75th anniversary - Sakshi

ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి వెస్పా 75వ ఎడిషన్ 125 సీసీ, 150 సీసీ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ₹1.26 లక్షలు (125 సీసీ, ‎ఎక్స్ షోరూమ్ పూణే‎), ₹1.39 లక్షల(150 సీసీ, ‎ఎక్స్ షోరూమ్ పూణే‎)కు విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లు కంపెనీ పోర్టల్, డీలర్స్ వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ల సైడ్ ప్యానెల్స్ పై '75' డెకాల్స్ అనే ప్రత్యేక నంబర్ ఉంటుంది.(చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌...!)

ఈ స్కూటర్లలో ఒరిజినల్ ఫీచర్లు, మెకానికల్ టెక్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటాయి. చిన్న 125సీసీ మోడల్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 9.93హెచ్ పీ పవర్, 5,500ఆర్ పీఎమ్ వద్ద 9.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 150 సీసీ సామర్థ్యం గల స్కూటర్ 7,600 ఆర్ పీఎమ్ వద్ద 10.4 హెచ్ పీ పవర్, 5,500 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ముందు వైపున 200మిమి డిస్క్, వెనుక వైపున 140మిమి డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయి. 125 సీసీ మోడల్ లో సీబిఎస్ సిస్టమ్ వస్తుంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 190 నగరాల్లో వెస్పా ఉనికిని కలిగి ఉంది. అయితే డీలర్‌షిప్‌లు త్వరలో 300 నగరాలకు విస్తరించడానికి కంపెనీ యోచిస్తోంది.(చదవండి: Wikipedia:హ్యాక్‌..! లిస్ట్‌లో టాప్‌ సెలబ్రిటీలు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top