2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!

Best Scooters For Womens In India 2023 - Sakshi

Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం..

హోండా యాక్టివా జి6 (Honda Activa G6)
దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది.

టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter)
టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)
మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా డియో (Honda Dio)
అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్‌ - కారణం ఇదే!

టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest)
మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top