పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్!

Paytm Offers Up To 100 pc Cashback On Mobile, Data Pack Recharges - Sakshi

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డులను పేటీఎం నేడు(సెప్టెంబర్ 23) ప్రకటించింది. ప్రతిరోజూ మొదటి 1,000 మంది వినియోగదారులు ఇన్నింగ్స్ విరామ సమయంలో తమ మొబైల్ ఫోన్ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్(రూ.50 వరకు) పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక!)

జియో, వీఐ, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కస్టమర్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. "కొత్త వినియోగదారులు జియో రూ.11, రూ.21, రూ.51 అదనపు డేటా ప్యాక్స్, వోడాఫోన్ ఐడియా రూ.16, రూ.48 అదనపు డేటా ప్యాక్, ఎయిర్‌టెల్ అదనపు డేటా ప్యాక్ రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్ జరిగే రాత్రి 7.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే విరామ సమయంలో వారు చేసుకునే ప్రతి రీఛార్జీలపై 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇతర బహుమతి వోచర్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు" పేటీఎం పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top