అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా అవతరించనున్న పేటీయం...!

Paytm May Become Big Ipo Issue In The Market - Sakshi

రూ.22,000 కోట్ల అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ..

పేటీఎమ్‌ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్‌! 

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్, ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ పేటీఎమ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు బోర్డు ముందస్తు అనుమతినిచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ఐపీవోకు వచ్చే వీలున్నట్లు అంచనా వేశాయి. తద్వారా రూ. 22,000 కోట్లవరకూ సమీకరించాలని పేటీఎమ్‌ భావిస్తున్నట్లు తెలియజేశాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 2 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు వాటాలను విక్రయించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. అయితే పేటీఎమ్‌ ప్రతినిధులు ఈ అంశాలపై స్పందించేందుకు నిరాకరించినట్లు సమాచారం.పేటీఎమ్‌ ఆశించిన స్థాయిలో నిధులను సమీకరించగలిగితే.. దేశీయంగా అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలుస్తుంది.  

పేటీఎమ్‌లో ప్రధాన వాటాలు ఇవీ..
పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌నకు 29.71% వాటా ఉంది. ఇదే విధంగా సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ (19.63%), సైఫ్‌ పార్టనర్స్‌ (18.56%)లతో పాటు విజయ్‌ శేఖర్‌ శర్మ (14.67%)ఏజీహెచ్‌ హోల్డింగ్, టీ రోవ్‌ ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్‌లకు వాటాలున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top