హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్‌

Over A Billion People To Be Affected If Melting Of Himalayan Glaciers Continue Study - Sakshi

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్‌లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్‌ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది.

వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం,  ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. 


మైదానాలు పూర్తిగా ఏడారులే..!
హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో  ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే,  నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్‌ ఆజామ్‌ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఐఐటీ ఇండోర్‌ బృందం గ్లేసియర్‌ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను,  పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది.

చదవండి: Phone Hacking : మీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా? గుర్తించండిలా?!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top