కెమెరా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌కు వేదికానున్న హైదరాబాద్‌

Oppo Sets Up Its Camera Innovation Lab In Hyderabad R And D Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కెమెరా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సెంటర్‌కు భాగ్యనగరం వేదిక కానుంది.  భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఒప్పో తన బేస్‌ను బలోపేతం చేస్తూ హైదరాబాద్‌లోని కంపెనీ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ఒప్పో ప్రకటించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఉపయోగించి కెమెరా సోల్యూషన్స్‌, యూజర్లకు మెరుగైన అనుభవం కోసం ఇమేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిపై ఒప్పో దృష్టిసారించనుంది.

మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్‌తో సహా ఇతర దేశాల కోసం భారత ఒప్పో టీం ప్రాతినిధ్యం వహించనుంది. కెమెరా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ వీడియో, స్టిల్ ఫోటోగ్రఫీ ఫుల్ డైమెన్షన్ ఫ్యూజన్ (ఎఫ్‌డీఎఫ్‌) పోర్ట్రెయిట్ వీడియో సిస్టమ్ టెక్నాలజీపై పరిశోధన కోసం పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా పని చేయనుంది. ఈ ల్యాబ్‌తో వివిధ కృత్రిమంగా సెట్ చేయబడిన దృశ్యాలలో ఫోన్ కెమెరాలను పరీక్షించడానికి. ఆ నమూనాల డేటాను విశ్లేషించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పో 2021 
జూన్ 30 నాటికి  8,800 ఇమేజ్ పేటెంట్‌ల కోసం దరఖాస్తు చేయగా అందులో సుమారు  3,500 పేటెంట్లకు హక్కులు వరించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top