వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్

OnePlus Watch May Launch Soon revealed by IMDA certification - Sakshi

శాంసంగ్, ఒప్పోకు ధీటుగా వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్

సాక్షి, ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్  మార్కెట్లో నెంబర్ వన్  గా కొనసాగుతున్న వన్‌ప్లస్  త్వరలో మరో కొత్త   సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే  వన్‌ప్లస్ టీవీలు,  వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో ఆకట్టుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్  త్వరలోనే స్మార్ట్‌వాచ్ లను  కూడా ఆవిష్కరించనుంది. తద్వారా శాంసంగ్, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

స్మార్ట్‌వాచ్ లాంచింగ్ పై  చాలాకాలంగా ఇంటర్నెట్‌లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే  సింగపూర్ ఇన్ఫోకామ్ మీడియా డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా దీనికి సంబంధించిన ధృవీకరణ పొందినట్లు  సమాచారం. దీంతో రాబోయే నెలల్లో వన్‌ప్లస్ వాచ్ పేరుతో వీటిని తీసుకురానుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ, మార్కెట్లో ఉన్న ప్రముఖ స్మార్ట్‌వాచ్‌లకు  ధీటుగా ఉండేలా మార్కెట్లోకి రానున్నాయి. ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫిట్‌నెస్,  హెల్త్ ఫీచర్స్ ముఖ్యంగా హృదయ స్పందన సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ,  స్లీప్ ప్యాటర్న్ అనాలిసిస్, గోల్స్ ఓరియెంటెడ్ ఎక్స్ ర్  సైజ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు.

కొనుగోలుదారులను మరింత ఆకర్షించేలా వన్‌ప్లస్ వాచ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 తరహాలో ఈసీజీ మానిటర్ లాంటి ప్రీమియం ఫీచర్లును కూడా జోడించనుంది. శాంసంగ్ తోపాటు ఇటీవల లాంచ్ చేసిన ఒప్పో వాచ్ లకు వన్‌ప్లస్ వాచ్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top