ఇలా చేస్తే కుదరదబ్బా..! ఝలక్‌ ఇచ్చిన కస్టమర్లు..ఇరకాటంలో ఓలా!

Ola S1 Electric scooter Production Temporarily Stopped - Sakshi

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ దిగ్గజం ఓలా తీవ్రంగా విమర్శల్ని మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వెహికల్స్‌ ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

తాత్కాలికంగా ఓలా ఎస్‌1 వెహికల్స్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రొడక్షన్‌  ఎందుకు ఆపేస్తున్నారో కొన్ని కారణాలు వివరిస్తూ ఎస్‌1 కస్టమర్లకు మెయిల్‌ పెట్టినట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. మళ్లీ ప్రొడక్షన్‌ ప్రారంభం అయ్యే వరకు కొనుగోలు దారులు ఎస్‌1 వెహికల్స్‌ కోసం ఎదురు చూడాల్సిందేనని నివేదికల్లో పేర్కొన్నాయి. కాగా అప్పటి వరకు ఓలా ఎస్‌1ప్రో అందుబాటులో ఉండనుంది. 

ఝలక్‌ ఇచ్చిన వాహన దారులు, ప్రొడక్షన్‌ నిలిపేసిన ఓలా 
ఎన్నోరోజుల నిరీక్షణ తర్వాత ఓలా గత డిసెంబర్‌ నెలలో కొనుగోలు దారులకు ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో స్కూటర్‌లను డెలివరీ చేసింది. వెహికల్స్‌ను డెలివరీ అయితే చేసింది కానీ సాఫ్ట్‌వేర్‌ విషయంలో కొనుగోలు దారులు ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఎస్‌1 బైక్‌ డ్రైవింగ్‌ సమయంలో వాహనదారులు తీవ్ర అసహననానికి గురయ్యారు. క్రూయిస్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌, నేవిగేషన్‌ అసిస్ట్‌, హైపర్‌ మోడ్‌'లలో సాఫ్ట్‌వేర్‌ లోపాలు తలెత్తడంతో ఓలాపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

ఛార్జింగ్‌, మైలేజ్‌ విషయంలో ఓలా ప్రచారం చేసినట్లుగా లేదని వరుస ట్వీట్లు చేస్తూ ఆ సంస్థకు ఝలక్‌ ఇచ్చారు. దీంతో దిగొచ్చిన ఓలా యాజమాన్యం వాహనదారులకు క్షమాపణలు చెప్పింది. ఎస్‌1 వెహికల్స్‌ సాంకేతిక సమస్యల్ని పరిష్కరిస్తామని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఓలా ఎస్‌1 ప్రొడక్షన్‌ను నిలిపి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

చదవండి: కొనుగోలు దారులకు ఓలా ఎలక్ట్రిక్‌ భారీ షాక్‌..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top