విశాఖలో ఓలా స్కూటర్ల​ డెలివరీ.. గెట్‌ రెడీ అంటున్న భవీశ్‌ అగర్వాల్‌

Ola Electric to start delivery in Visakhapatnam and other cities in Second Phase - Sakshi

కాలుష్యం తగ్గించడంతో పాటు పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను భావిస్తున్నారు. ఈ తరుణంలో సంచలన రీతిలో మార్కెట్‌లో అడుగు పెట్టింది ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. ఆగష్టు 15న ఈ స్కూటర్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరులో ఈ బైకుల డెలివరీ చేయాల్సి ఉంది.

అప్పుడు వాయిదా
అయితే అనివార్య  కారణాల వల్ల ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డెలివరీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మార్కెట్‌లో హైప్‌ తగ్గకుండా చూసుకునేందుకు నవంబరులో టెస్ట్‌ డ్రైవ్‌ పేరిట దేశమంతగా ఓలా స్కూటర్లను తిప్పారు. కాగా డిసెంబరు ద్వితీయార్థంలో ఓలా స్కూటర్ల డెలివరీ ప్రారంభమైంది. ముందుగా బెంగళూరు, చెన్నైలలో వీటి డెలివరీ చేశారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో డెలివరీ ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

రెండో విడతలో
ఓలా స్కూటర్ల డెలివరీపై ఉన్న సందేహాలకు సమాధానంగా ఆ కంపెనీ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. బెంగళూరు, చెన్నై తర్వాత ఎక్కడ డెలివరీ చేయబోయే నగరాల వివరాలను వెల్లడించారు. భవీశ్‌ అగర్వాల్‌ చెప్పిన వివరాల ప్రకారం రెండో విడత డెలివరీలో వైజాగ్‌, పూనే, అహ్మదాబాద్‌, ముంబైతో పాటు మరికొన్ని సిటీలు ఉన్నాయి. అయితే ఇందులో హైదరాబాద్‌లో డెలివరీ ఉందా? లేదా అనే అంశంపై స్పస్టత కరువైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓలా స్కూటర్లు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా వైజాగ్‌ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి, 

చదవండి: గుడ్‌న్యూస్‌.. నెక్సాన్‌ రేంజ్‌ పెరిగింది! మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top