Ola Electric New S1 E Scooter Launch On August 15 - Sakshi
Sakshi News home page

Ola Electric S1 E-Scooter:మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్‌ స్కూటర్‌, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!

Published Mon, Aug 15 2022 4:28 PM

Ola Electric New S1 E Scooter Launch On August 15 - Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఓలా ఎస్‌1 (Ola S1)ని కూడా రిలీజ్‌ చేసింది. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్‌ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందివ్వగల ఈ  స్కూటర్‌ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్‌ని బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్‌ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్‌ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.


 
Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్‌ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి.  ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్‌ (నార్మల్‌ మోడ్‌) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు.


దీని టాప్‌ స్పీడ్‌ 95kmphగా ఉంది. ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి

Advertisement
 
Advertisement
 
Advertisement