Odisha Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Odisha Govt Offices To Function With 50 Percent Staff - Sakshi

ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్‌ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్ నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని ప్రముఖ దిగ్గజ ప్రైవేట్‌ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ ఒమిక్రాన్‌ దెబ్బకు మళ్లీ పునరాలోచనలో పడ్డాయి.ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ఓ రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో పని చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.   

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం జనవరి 7 నుండి జనవరి 31 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, సబ్- ఆర్డినేట్ కార్యాలయాలు 50శాతం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఎంపిక విధానాన్ని సంబంధింత డిపార్ట్‌మెంట్‌/ కార్యాలయాల ఉన్నతాధికారులు నిర్ణయించుకోవచ్చని' సాధారణ పరిపాలన, పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ లు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. 

అయితే, ప్రత్యేక సహాయ కమిషనర్‌, ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వాహణ అథారిటీ, పోలీస్‌,అగ్నిమాపక, ఆరోగ్యం, మున్సిపల్‌ సేవలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యాలయాలు,సేవలను పరిధి నుండి మినహాయించింది. ఈ విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఒడిశా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. 

ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఒడిశా సబార్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి అన్ని నియామక సంస్థల కార్యాలయాల్లో 75 శాతం మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలిపారు. రోస్టర్‌లో విధుల్ని కేటాయించని అధికారులు, సిబ్బంది రెగ్యులర్, పెండింగ్ పనులకు హాజరు కావడానికి వారికి అందించిన వీపీఎన్‌తో ఇంటి నుండి పని చేయాలని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలైన ఉద్యోగులు ఇంటి వద్దనుంచి పనిచేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోం: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top