ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!

Nubia Launched 18GB RAM Red Magic 6 Pro Gaming Phones in China - Sakshi

సాధారణంగా హై ఎండ్ మొబైల్స్ లో అత్యధికంగా 8జీబీ ర్యామ్ లేదా ఇంకొంచం ఎక్కువ అయితే 12జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ, న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18 జీబీ ర్యామ్‌ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో తీసుకోని వచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 6 ప్రో 18జీబీ ర్యామ్ గల మొబైల్ లో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొనివచ్చారు. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది.

రెడ్‌మ్యాజిక్‌ 6 & రెడ్‌మ్యాజిక్‌ 6 ప్రో ఫీచర్స్:
వీటిలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్‌ ఉన్నాయి. 165 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటు ఉన్న ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, మల్టీ టచ్‌లో 360 హెర్జ్‌‌ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్‌పీడీడీఆర్‌ 5 ర్యామ్‌, 3.1 యూఎఫ్‌ఎస్‌ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ మొబైల్‌లో బ్యాటరీ కూలింగ్‌ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. రెడ్‌ మ్యాజిక్‌ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్‌ 6లో 5,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్‌లోకి ఈ మొబైల్స్‌ విక్రయానికి రానున్నాయి.

రెడ్‌మ్యాజిక్‌ 6 ధర:
  8జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 3,799 (సుమారు రూ.42,700)
12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,099 (సుమారు రూ.46,000)
12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,500) 

రెడ్ మ్యాజిక్ 6 ప్రో ధర:
12జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,550)
12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర: చైనా యువాన్లు 4,799 (సుమారు రూ.54,000)
16జీబీ + 256జీబీ వేరియంట్ ‌ధర: చైనా యువాన్లు 5,299 (సుమారు రూ.59,600) 
18జీబీ + 512జీబీ వేరియంట్ ‌ధర: చైనా యువాన్లు 6,599 (సుమారు రూ.74,200) 

చదవండి:

తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

వాహనదారులకు కేంద్రం శుభవార్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top