రివైండ్‌: అప్పట్లో అలరించిన ఈ యాడ్స్‌ గుర్తున్నాయా?

Nostalgia Old Commercial Tv Adds During Nineties Era - Sakshi

Old TV Advertisements: అడ్వర్టైజింగ్‌ క్యాంపెయిన్స్‌.. బిజినెస్‌కి అవసరమైన ప్రధాన సూత్రం.  ఒక బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు, జనాలకు దగ్గరిదాకా తీసుకెళ్లేందుకు వీటికి మించిన పవర్‌ఫుల్‌ మార్గం మరొకటి ఉండదు. అందుకే వెరైటీ కాన్సెప్ట్‌లు, రకరకాల స్క్రిప్‌లతో తమలోని క్రియేటివిటీ మొత్తాన్ని చూపిస్తుంటారు యాడ్‌ మేకర్స్‌, డైరెక్టర్స్‌. 

దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యాడ్స్‌ ట్రెండ్‌.. పోను పోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఒకానొక టైంలో వచ్చిన యూనివర్సల్‌ యాడ్స్‌ మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా నైంటీస్‌, మిలీనియంలో బుల్లితెర ద్వారా ఇంటింటికీ చేరిన ఈ యాడ్స్‌.. ఇప్పటికీ తలుచుకున్నా ఆహ్లాదకరమైన ఓ అనుభూతి కలుగుతుంది. పిల్లలతో పాటు పెద్దల పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో చాలావరకు క్రికెట్‌ మ్యాచ్‌ల మధ్యల్లో రిపీట్‌గా టెలికాస్ట్‌ కావడం వల్ల చాలామందికి బహుశా ఇవి కనెక్ట్‌ అయ్యి ఉండొచ్చు.

అతుక్కుపోయే గుణం ఉన్న ఫెవికిక్‌ను చేపల వేటను ఉపయోగించే ఈ ఫన్నీ యాడ్‌.. చివర్లో ఆ వ్యక్తి నవ్వే నవ్వు.

ప్రాణం కన్నా డబ్బు మిన్న అనుకునే ఓ వ్యక్తికి నీటి బొట్టు ఇచ్చే భారీ షాక్‌.. ఎమ్‌సీల్‌ యాడ్‌ కోసం రూపొందించింది.

జంతువుల్లో ఉన్న సెన్సిబుల్‌ ప్రేమను.. ఆడ పక్షి- దత్తత తాబేలు పిల్ల, ఆ పిల్లను యాక్సెప్ట్‌ చేసే మిగతా పక్షి పిల్లల ద్వారా చూపించిన సరదా యాడ్‌. 

చిన్నప్పుడు చదివిన కాకి-దాహం కథ.. రాళ్లకు బదులు ముక్కుతో పొడిచే కాకి.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సాంగ్‌(తెలుగు వెర్షన్‌ కూడా ఉంటుంది) 

కరెంట్‌ లేని ప్యాలెస్‌లో దీపం పెట్టే కూలీల కథ.. చివరిదాకా అర్థం కానీ ట్విస్ట్‌.. హ్యాపీడెంట్‌ చూయింగ్‌గమ్‌ యాడ్‌ 

మూకీ యాడ్‌లలో కొత్త ఒరవడి.. మిరిండా యాడ్‌

దురదృష్టంలోనూ సరదాను ఆస్వాదించొచ్చని చూపించిన సరదా పెప్సీ యాడ్‌.. మేరా నెంబర్‌ కబ్‌ ఆయేగా(నా నెంబర్‌ ఎప్పుడు వస్తుంది)

పగిలిపోని గుడ్డు.. జుట్టు పీక్కునే వంటగాడు. ఫెవికల్‌ డబ్బాలో దాణా తినే కోడి..  

ఉల్లాసంగా సాగే లిరిల్‌ సోప్‌ యాడ్‌.. జలపాతం, అందమైన లొకేషన్‌లో వయ్యారి చిందులు

కుటుంబ ఆప్యాయతలకు అడ్డొచ్చే గోడను బద్ధలు కొట్టాలని ప్రయత్నించే కవల అన్నదమ్ములు. బాంబులతో పేల్చిన బద్ధలు కానీ అంబూజా సిమెంట్‌తో కట్టిన గోడ.. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని యాడ్‌లు. వాటిలో కొన్ని మాత్రం ఇవి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top