షాకింగ్‌.. బ్రేకింగ్‌! ఇదేం ఐఫోన్‌ భయ్యా.. వైరల్‌ వీడియో | New iPhone 15 Fails Bend Test As It Breaks In User's Hands; Video Viral - Sakshi
Sakshi News home page

iPhone 15: షాకింగ్‌.. బ్రేకింగ్‌! ఇదేం ఐఫోన్‌ భయ్యా.. వైరల్‌ వీడియో

Published Wed, Sep 27 2023 4:37 PM

New iPhone 15 fails bend test as it breaks in user hands - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్లు యాపిల్‌ (Apple) ఐఫోన్లు. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ను యాపిల్‌ ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్లు మార్కెట్‌లోకి వచ్చినప్పుటి నుంచి రోజుకో కంప్లైంట్‌ వెలుగులోకి వస్తోంది.

తాజాగా ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max)పై జెర్రీరిగ్‌ఎవెరీథింగ్‌ (JerryRigEverything) అనే యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన నాణ్యత పరీక్షకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ నాణ్యతపై రకరకాల పరీక్షలు చేశారు. దీంట్లో ప్రధానంగా కేవలం చేతి వేళ్లలో వంచగానే ఫోన్‌ వెనుకవైపున్న గ్లాస్‌ చిట్లిపోయింది.

‘ఐఫోన్15 ప్రో మ్యాక్స్‌ను అత్యంత దృఢమైన గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేసినట్లు యాపిల్ ప్రకటించినప్పుడు తాను ఆశ్చర్యపోయాను. కానీ టైటానియం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెనుక గ్లాస్ ప్రైమ్ టైమ్ కోసం సిద్ధంగా లేదని తేలింది. యాపిల్స్ కొత్త ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఏదో తప్పు జరిగింది’ అని  వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు.

యూట్యూబ్‌లో సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8.5 మిలియన్లకు పైగా వ్యూవ్స్‌ వచ్చాయి. 2.6 లక్షలకుపైగా లైక్‌లు రాగా వేలాది మంది కామెంట్‌లు చేశారు. "నేను షాక్ అయ్యాను. ప్రో మాక్స్ అంత తేలిగ్గా బ్రేక్ అవుతుందని ఊహించలేదు.. ఆ బ్రేక్ షాకింగ్ గా ఉంది" అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ను కొంతమంది ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లోనూ షేర్‌ చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement