ఆధార్ సమస్యల పరిష్కారానికి కొత్త హెల్ప్ లైన్

New Helpline Number For Aadhaar Related Queries - Sakshi

ముంబై: మీరు ఆధార్ మార్పులు చేస్తున్నారా? మీ ఆధార్ కార్డ్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా? ప్రతీ చిన్న పనికి ఆధార్ సెంటర్‌కు వెళ్లలేకపోతున్నారా?. అయితే ఏమి పర్వాలేదు ఇప్పుడు మీరు ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ కీ కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - UIDAI ఆధార్ సమస్యల పరిష్కారం కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 1947ని లాంఛ్ చేసింది. ఈ ఆధార్ హెల్ప్‌లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది.

ఏజెంట్లు, సోమ – శని వారాలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ సేవకులు అందుబాటులో ఉంటారు. ఆధార్ హెల్ప్‌లైన్ 1947 ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ మరియు ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది. మీకు నచ్చిన భాషలో సంభాషణ కోసం హెల్ప్‌లైన్ కీ కాల్ చేయవచ్చు. (చదవండి: పీవీసీ ఆధార్: మొబైల్‌ నెంబర్‌తో పనిలేదు)

రోజూ లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్ధ్యం యూఐడీఏఐ కాల్ సెంటర్‌కు ఉంది. ఐవీఆర్ఎస్ సిస్టమ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు దగ్గర్లోని ఆధార్ సెంటర్ వివరాలు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల్ని emailhelp@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top