BMW R18 Transcontinental: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైక్: ధర & వివరాలు

New bmw r18 transcontinental launched in india - Sakshi

ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు మోటొరాడ్ (BMW Motorrad) దేశీయ మార్కెట్లో కొత్త ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్18 లైనప్‌లో చేసింది. 

ధరలు:
భారతదేశంలో విడుదలైన కొత్త బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ ధర అక్షరాలా రూ. 31.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే ఈ లైనప్‌లో ఆర్18, ఆర్18 ఫస్ట్ ఎడిషన్, ఆర్18 క్లాసిక్ ఫస్ట్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ చేరింది.

కలర్ ఆప్సన్స్:
బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ మొత్తం ఐదు కలర్ అప్షన్స్‌లో లభిస్తుంది. అవి బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, గ్రావిటీ బ్లూ మెటాలిక్, మాన్‌హట్టన్ మెటాలిక్ మ్యాట్, మినరల్ వైట్ మెటాలిక్, గెలాక్సీ డస్ట్ మెటాలిక్/టైటాన్ సిల్వర్ 2 మెటాలిక్ కలర్స్.

డిజైన్ & ఫీచర్స్:
ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ దాని మునుపటి మోడల్స్‌కి కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో విండ్‌స్క్రీన్, విండ్ డిఫ్లెక్టర్‌లు, బాడీ-కలర్డ్ ప్యానియర్స్, టాప్‌బాక్స్‌తో పెద్ద హ్యాండిల్‌బార్ మౌంటెడ్ ఫెయిరింగ్‌ ఉన్నాయి. అంతే కాకుండా పిలియన్ సీటు, అల్లాయ్ వీల్స్‌ కూడా చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చూడవచ్చు. ఇది రౌండ్ అనలాగ్ గేజ్‌లతో 10.25 ఇంచెస్ స్క్రీన్. ఈ బైకులో ఆరు స్పీకర్లు, సబ్‌ వూఫర్‌తో మార్షల్ గోల్డ్ సిరీస్ స్టేజ్ 2 సౌండ్ సిస్టమ్‌ ఉంటుంది. యాక్టివ్ క్రూయిస్ కంట్రోల్ రాడార్ సెన్సార్‌లను ఉపయోగించి వేగాన్ని అడ్జస్ట్ చేస్తుంది.

(ఇదీ చదవండి: మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..)

పవర్‌ట్రెయిన్:
బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ బైక్ అదే 1,802సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ కలిగి 91 హెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి రెయిన్, రోల్, రాక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top