
ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ముత్తూట్ పాపచన్ గ్రూప్ అనుబంధ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశ పరచింది. ఇష్యూ ధర రూ. 291తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 278 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 9 శాతంవరకూ పతనమై రూ. 265 వద్ద కనిష్టాన్ని తాకింది.
చివరికి 8.5 శాతం నష్టంతో రూ. 266 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 5.4 శాతం డిస్కౌంట్‌తో రూ. 275 వద్ద లిస్టయ్యింది. చివరికి 8.6 శాతం క్షీణతతో రూ. 266 వద్ద నిలిచింది.
దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 4,539 కోట్లుగా నమోదైంది. 11 రెట్లుపైగా స్పందన లభించిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 960 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ ప్రధానంగా మైక్రోఫైనాన్స్ సరీ్వసులు అందిస్తోంది.