ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీవో బాట.. రూ.1800 కోట్లు టార్గెట్‌!

Muthoot Micro Fin Plans For 1800 Crore Ipo - Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ కంపెనీ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ పబ్లిక్‌ ఇష్యూ యోచనలో ఉంది. ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ ప్రమోట్‌ చేసిన కంపెనీ 2023 చివరి క్వార్టర్‌కల్లా క్యాపిటల్‌ మార్కెట్లను ఆశ్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,500–1,800 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ థామస్‌ ముత్తూట్‌  తెలియజేశారు. దీంతో మైక్రోఫైనాన్స్‌ పరిశ్రమ(ఎంఎఫ్‌ఐ)లోనే అతిపెద్ద ఐపీవోగా నిలవనున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా లిస్టింగ్‌కల్లా రూ.10,000 కోట్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) కలిగిన తొలి ఎంఎఫ్‌ఐగా రికార్డ్‌ సాధించే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్, ముత్తూట్‌ కుటుంబానికి 71 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించారు. పీఈ సంస్థ జీపీసీ 16.6 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. 

చదవండి: ఐటీలో ఫేక్‌ కలకలం.. యాక్సెంచర్‌ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top