అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు! | Mukesh Ambani Antilia Chef Earns Rs 24 Lakh | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!

Apr 23 2026 6:57 PM | Updated on Apr 23 2026 7:27 PM

Mukesh Ambani Antilia Chef Earns Rs 24 Lakh

ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ.. కుటుంబంతో కలిసి అత్యంత ఖరీదైన యాంటిలియాలో నివాసం ఉంటున్నారు. రాజప్రాసాదంలా ఉండే ఈ భవనం లోపల జరిగే ప్రతి పని ఒక పెద్ద సంస్థలో జరిగేలా క్రమబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కిచెన్ పని విధానం చూస్తే.. అదొక 7-స్టార్ హోటల్ స్థాయి నిర్వహణలా ఉంటుంది.

యాంటిలియాలో పనిచేసే సుమారు 600 మంది సిబ్బందికి ప్రతిరోజూ భోజనం అందించాలి. దీనికోసం రోజుకు సుమారు 4000 రోటీలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే చెఫ్ బాధ్యత చాలా కీలకమైనది. ఎందుకంటే.. అతను కేవలం వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఒక మేనేజర్‌, ఒక ప్లానర్‌ కూడా.

అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్‌ జీతం ఏడాదికి సుమారు 24 లక్షల రూపాయలు (నెలకు రూ.2 లక్షలు) అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే ఎక్కువ జీతం వస్తుందనే మాట ఒక అపోహ మాత్రమే అవుతుంది. ఒక రంగంలో ప్రతిభ, నైపుణ్యం ఉంటే.. ఎక్కడైనా మంచి జీతం లభిస్తుంది.

యాంటిలియాలోని చెఫ్‌ పని ఎంతో ఒత్తిడితో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు ఒకే రుచి, ఒకే నాణ్యతతో ఆహారం తయారు చేయాల్సి ఉంటుంది. పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి. తన టీమ్‌ను సమర్థవంతంగా నడిపించాలి. ముఖ్యంగా.. సమయానికి అన్నీ సిద్ధం చేయాలి. ఇంత పెద్ద స్థాయిలో ఒక చిన్న పొరపాటు జరిగినా, అది వెంటనే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement