రిలయన్స్‌ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌

Mukesh Ambani and his luxurious properties across the globe - Sakshi

వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ  ముఖేశ్‌  అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్‌ అంబానీకి  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన  ఆస్తులను  సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ  కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్‌ హోటల్‌ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే.

రిలయన్స్  అధినేత ముఖేశ్‌ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం:
అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్‌ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి  ఆంటిలియాలోనే ఉంటారు.  పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే.  అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్‌ వారికి పెద్ద లెక్కే కాదు. 

యాంటిలియా
ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా.  60 ప్లోర్లతో  27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్‌ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు.  17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్‌ ఫౌండర్‌ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు.

యూకేలోని స్టోక్ పార్క్
లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్‌ అంబానీ సొంతం.  అల్ట్రా-రిచ్  ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్‌ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్‌లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.   

న్యూయార్క్‌లోని లావిష్‌  హోటల్‌
దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్‌లోని   పాపులర్‌ హోటల్‌లో అంబానీ  248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని  2022లో 98.15 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారట.

పామ్ జుమేరియా ఇల్లు
లాస్ట్‌ బట్‌ నాట్‌  లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి  రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా  బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌.  అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్‌ కాలనీలు,  అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top