
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్‌ఈడీ సూపర్ హెచ్‌డీ ఫ్లాట్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్‌లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.
మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు
🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్‌ఈడీ సూపర్ హెచ్‌డీ ఫ్లాట్ డిస్‌ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.
🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.
🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.
🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు.