Moto G52: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్..!

MOTOROLA G52 smart phone may launch in india - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్ ను  లాంచ్ చేయనుంది.  తాజాగా మోటో జీ సిరీస్‌లో  భాగంగా మోటో జీ52 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూరోప్ మార్కెట్లలోకి పరిచయం చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో కి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం.

మోటో జీ52 సంబందించిన పలు ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇక మోటో జీ 52 ఇండియా వెర్షన్ స్మార్ట్ ఫోన్ పీఓఎల్ఈడీ (pOLED) డిస్‌ప్లేతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తేలికైన, సన్నని స్మార్ట్‌ఫోన్ గా  నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోటో జీ 52 స్మార్ట్ ఫోన్ కొద్ది రోజుల క్రితం లాంచ్ ఐనా.. మోటో జీ 51 కి కొనసాగింపుగా రానుంది. యూరప్ లో మోటో జీ 52  249 యూరోలు (దాదాపు రూ. 20,600)గా నిర్ణయించారు. ఇక భారత మార్కెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ధర 20 వేల కంటే తక్కువ ధరలో వుండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ చార్‌కోల్ గ్రే, పింగాణీ వైట్‌ (Porcelain White) కలర్ ఆప్షన్స్ లో వస్తుంది.

మోటో జీ52 స్పెసిఫికేషన్ (అంచనా)

  • 6.6-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • 4జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 12
  • 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 
  • 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్‌
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top