Moto G60, Moto G40 Price In India, Features: మోటరోలా నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్లు - Sakshi
Sakshi News home page

మోటరోలా నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్లు 

Apr 21 2021 12:40 PM | Updated on Apr 21 2021 3:05 PM

Moto G60 and G40 Fusion Smartphones Launched in India, Price, Specifications - Sakshi

మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్‌లో రెండు జీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్‌లో రెండు జీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్‌ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. మోటో జీ60: 108 మెగా పిక్సల్‌ క్వాడ్‌ కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అల్ట్రా పిక్సల్‌ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 11పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే రకం ఇందులో అందుబాటులో ఉంటుంది.


మోటో జీ40 ఫ్యూజన్‌
ఇందులోనూ 120 గిగాహెర్జ్‌ 6.8 అంగుళాల హెచ్‌డీఆర్‌ 10 డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జీ ప్రాసెసర్‌ ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ ప్రధాన కమెరాగా క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఉంది. జీ40 ఫ్యూజన్‌ 4జీబీ/64జీబీ రకం ధర రూ.13,999. 6జీబీ/128జీబీ  ధర రూ.15,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది.


మోటో జీ60 ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభ విక్రయాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసిన వారికి అప్పటికప్పుడే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement