ChatGPT Integration: కోడింగ్‌ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్‌ మరో సంచలనం!

Microsoft Integrated Chatgpt With Other Tools Power Platform - Sakshi

సాఫ్ట్‌వేర్‌ కొలువు అంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి.. అనుకుంటాం. కానీ ఇవేవీ అక్కర్లేకుండానే ఐటీలో కొన్ని కొలువులు కొట్టేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? 

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు చేసేలా కొత్త టూల్‌ను విడుదల చేయనుంది. మైక్రోసాఫ్ట్‌ తన సొంత సెర్చ్‌ ఇంజిన్‌ ‘బింగ్‌’లో ఏఐ చాట్‌జీపీటీతో పాటు మరో ఏఐ టూల్‌ ‘పవర్‌ ప్లాట్‌ఫామ్‌’(Power Platform) ను ఇంటిగ్రేట్‌ చేయనుంది. ఒక్కసారి ఈ టూల్‌ అందుబాటులోకి వస్తే.. ఏమాత్రం కోడింగ్‌(coding)  అవసరం లేకుండా వివిధ రకాలైన అప్లికేషన్‌ల(apps)ను డెవలప్‌ చేయొచ్చని తెలిపింది. 

ఆఫీస్‌లో ఆటోమెషిన్‌ సాయంతో చేసే పనులన్నీ ఈ టూల్‌తో చేసుకోవచ్చు. డేటాను విశ్లేషించడం (analyze),ఈమెయిల్‌ క్యాంపెయిన్‌, చాట్‌బోట్స్‌ తయారీ, వీక్లీ వర్క్‌ రిపోర్ట్స్‌ ,కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు సమ్మరీ తయారు చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు చెప్పారు.  

వీటితో పాటు ఏఐ బిల్డర్‌ (AI Builder) అనే మరో టూల్‌ను సైతం యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఏఐ బిల్డర్ అనేది బిజినెస్‌ వర్క్ ఫ్లోలను ఆటోమేట్ (Workflow automation) చేయడానికి అనుమతిస్తుంది. కంపెనీ తన బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్‌ ఫారమ్‌ డైనమిక్స్ 365 కోపిలాట్ (Dynamics 365 Copilot) కొత్త వెర్షన్‌ను  ప్రారంభించింది. ఈ కొత్త వెర్షన్‌ సాయంతో కొన్ని పనులను ఆటోమేట్ చేసేందుకు ఏఐని జత చేసింది.  

సత్యనాదెళ్ల ప్రకటన
ఏఐతో ప్రొడక్టవిటీ పునరుద్ధరించడం(reinventing productivity with AI) అనే అంశం గురించి చర్చించేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మార్చి 16న ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కంపెనీ తన పాపులర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సెర్చ్ ఇంజిన్ బింగ్ కోసం ఏఐ అప్‌డేట్‌లను ప్రకటించినప్పటికీ, వర్డ్ -ఎక్సెల్‌ సహా దాని ఆఫీస్ ప్రొడక్టివిటీ సూట్ కోసం ఇంకా ఏఐని విడుదల చేయలేదు. వీటి గురించి ఆ కార్యక్రమంలో సత్యనాదెళ్ల ప్రకటన చేసే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top