
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మ్యాటర్ తాజాగా తమ ఎరా మోటర్‌సైకిల్‌ను (Matter Aera) హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎరా 5000ప్లస్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 1,93,826గా (హైదరాబాద్ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ. రేంజి, బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతమున్న 15 డీలర్‌షిప్‌లను మరింతగా విస్తరిస్తున్నామని, హైదరాబాద్‌లో ఒకటి ఉండగా, ఖమ్మంలో మరొకటి ప్రారంభిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీటీవో కుమార్ ప్రసాద్ తెలికెపల్లి చెప్పారు. త్వరలో మరో 200 మిలియన్ డాలర్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపారు.
కొత్త ప్లాంటు ఏర్పాటు, ఇతరత్రా అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు ప్రసాద్ చెప్పారు. ఇప్పటివరకు సుమారు 75 మిలియన్ డాలర్లు సమీకరించగా, కంపెనీకి ప్రస్తుతం సాణంద్‌లో 1.2 లక్షల వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఓ ప్లాంటు ఉంది.
ఇదీ చదవండి: ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కంపెనీ