స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ

Market open flat- IT, Pharma sectors up - Sakshi

45 పాయింట్లు అప్‌- 38,891 వద్దకు సెన్సెక్స్‌

14 పాయింట్లు ఎగసిన నిఫ్టీ- 11,519 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మీడియా, ఫార్మా లాభాల్లో

ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో రంగాలు వీక్‌

బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం ప్లస్‌

సరిహద్దువద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 45 పాయింట్లు బలపడి 38,891ను తాకగా.. 14 పాయింట్ల లాభంతో 11,519 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,940- 38,803 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,529- 11,492 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. 

ఐటీ స్పీడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా ఐటీ, ఫార్మా 1.3-0.7 శాతం మధ్య బలపడగా.. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4 శాతం జంప్‌చేయగా.. టీసీఎస్‌, జీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, కొటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ 2-1  శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే బజాజ్‌ ఆటో, సిప్లా, నెస్లే, గెయిల్‌, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ 1.5-0.75 శాతం మధ్య నీరసించాయి.
 
డెరివేటివ్స్‌లో..
డెరివేటివ్‌ కౌంటర్లలో బాలకృష్ణ, సన్‌ టీవీ, మణప్పురం, మైండ్‌ట్రీ, అరబిందో, కోఫోర్జ్‌, అపోలో హాస్పిటల్స్‌, వేదాంతా, ఇండిగో, అశోక్‌ లేలాండ్‌ 2.5-1.25 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్‌ స్టీల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బీవోబీ, బయోకాన్‌, బంధన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, లుపిన్‌, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఈసీ, పిరమల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్డ్‌, ఎక్సైడ్‌, పీఎన్‌బీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 938 లాభపడగా.. 850 నష్టాలతో కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top