భారీ ధరకు అమ్ముడైన నెల్సన్ మండేలా అరెస్టు వారెంట్‌ ఎన్ఎఫ్‌టీ..!

Mandelas Arrest Warrant NFT Raises 130000 Dollars in Auction - Sakshi

నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత & మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు మండే. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. అరెస్టు వారెంట్‌కు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను ఎన్ఎఫ్‌టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది.  

ఈ నెల్సన్ మండేలా ఎన్ఎఫ్‌టీని ఒక వ్యక్తి 1,30,000(రూ.99 లక్షలు) డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్‌టీ విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విశేషాలను సంరక్షించే లిల్లీస్ లీఫ్ మ్యూజియం హెరిటేజ్'కు అందజేయనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినందుకు 1962లో అతన్ని అరెస్టు చేశారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఇతను ఒకరు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు.

2004లో మండేలా ఒరిజినల్ అరెస్టు వారెంట్‌ డాక్యుమెంట్‌ను దాతలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం డాక్యుమెంట్‌ ఎన్ఎఫ్‌టీని సొంతం చేసుకున్న వ్యక్తి దీని ఒరిజినల్ డాక్యుమెంట్‌ను చూసేందుకు అనుమతి ఉంటుంది. గత సంవత్సరం తోటి స్వాతంత్ర్య సమరయోధుడు ఒలివర్ టాంబోకు చెందిన ఓ 'పెన్ గన్' ఎన్ఎఫ్‌టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేయడం వల్ల మ్యూజియంకు సుమారు 50,000 డాలర్లు వచ్చాయి. కోవిడ్ కారణంగా పర్యాటకం పరిశ్రమ వల్ల భారీగా ఆదాయం పడిపోయింది. దీంతో గొప్ప కట్టడాలు, మ్యూజియం నిర్వహణ కష్టసాద్యం అవుతుంది. అయితే, ఎన్ఎఫ్‌టీ  వేలం ద్వారా వచ్చిన డబ్బు వల్ల వీటి నిర్వహణ భారం కొద్దిగా తగ్గుతుంది. 

(చదవండి: నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top