నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు! | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!

Published Sun, Mar 27 2022 3:59 PM

Engineering, Telecom, Healthcare To Add 12 mn Jobs By FY26: Report - Sakshi

2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. 

ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. 

"మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు.

(చదవండి: ఎలన్‌మస్క్‌ సంచలన నిర్ణయం..! సోషల్‌ మీడియాపై గురి..!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement