3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో దగ్గరికి వచ్చిన కస్టమరుకు సీఈఓ క్షమాపణలు

Man Books OYO Room in Pondicherry Only to Find Out it Does not Exist - Sakshi

ఇటీవల పుదుచ్చేరికి 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఓయో లాడ్జ్ కి వచ్చిన ఒక బృందానికి ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. పుదుచ్చేరిలో ఓయోలో రూమ్ బుక్ చేసిన ఈ బృందానికి తీర ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి  అక్కడ ఆ ఓయో లాడ్జ్ లేదు. దీంతో వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఈ బృందంలోని సభ్యుల్లో ఒకరైన అభినందన్ పంత్ ఈ అనుభవం గురించి లింక్డ్ ఇన్లో పోస్ట్ రాశారు. ఈ ఆసక్తికర పరిణామం గురించి వీడియో కూడా చిత్రీకరించారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ తొమ్మిది మంది గల బృందం ఓయో 74612 రాయల్ ప్లాజా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లో గదులను బుక్ చేసుకున్నారు. కానీ, వారు 3000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో లాడ్జ్ ఉన్న ప్రదేశానికి డిసెంబర్ 24 రాత్రి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అడవి మొక్కల ప్రదేశం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. తాను, తన తోటి ప్రయాణికులు రాత్రి పూట నిర్మానుష్యమైన రహదారిపై చిక్కుకుపోయినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఓయో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసినప్పుడు, తాము ఇతర లాడ్జింగ్ ఏర్పాటు చేయలేమని తనకు చెప్పినట్లు పంత్ పేర్కొన్నాడు. కానీ అతను ఆ నగరంలో తనిఖీ చేసినప్పుడు 50కి పైగా ఆస్తులు గల ఓయో లాడ్జ్ అందుబాటులో ఉన్నట్లు అతను అన్నాడు.  చివరకు అక్కడ ఉండటానికి ఇతర హోటళ్లకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు పంత్ చెప్పారు. 

అక్కడ ఉన్న ఒక హోటల్ లో బస చేశామని, క్రిస్మస్ వారాంతం కావడం వల్ల చివరి నిమిషంలో హోటల్ బుకింగ్ ఖర్చును రెట్టింపు చేసినట్లు తెలిపాడు. గత ఏడాదిగా ఉనికిలో లేని ఈ హోటల్ గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారని తను అన్నాడు. తనకు అసౌకర్యానికి చింతిస్తూ ఓయోపై కేసు వేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. భారతదేశం & ఆగ్నేయ ఆసియా ఓయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ అభినందన్ పంత్ లింక్డ్ ఇన్ పోస్టుకు స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. "అలాగే, ఆ లాడ్జ్ మా ప్రమాణాలను ఏమాత్రం చేరుకోలేదు. మీ అనుభవంతో మరిన్ని మార్పులు చేయడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మేము సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాము" అని కపూర్ పంత్ పోస్ట్ పై ఒక వ్యాఖ్యలో తెలిపారు. ఓయో సీఈఓ తను అసౌకర్యానికి గురైన ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ పంపమని అభినందన్ ను కోరాడు. "అలాగే మీ అనుభవం నుంచి మరింత నేర్చుకుంటాను" అని ఆయన అన్నారు. 

(చదవండి: శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top