కొనుగోలుదారులకు భారీ షాక్‌, మహీంద్రా కార్లలో లోపాలు..రీకాల్‌కు పిలుపు

Mahindra Recall Xuv700 And Scorpio-n Over Bell Housing Issue - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తయారు చేసిన కార్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కార్లలో వేడిని నిరోధించేందుకు సింథటిక్‌ ఎలాస్టోమర్‌ నుంచి తయారు చేసిన రబ్బర్‌ బెలో’లో లోపాలు తలెత్తుతున్నట్లు తేలింది. దీంతో మహీంద్రా యాజమాన్యం ఈ ఏడాది జులై 1 నుంచి నవంబర్‌ 11 వరకు మ్యానిఫ్యాక్చరింగ్‌ చేసిన 6618 స్కార్పియో - ఎన్‌ కార్లను, ఎక్సయూవీ - 700 వేరియంట్‌కు చెందిన 12,566 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. 

కార్లలోని తలెత్తుతున్న లోపాలపై మహీంద్రా యాజమాన్యం స్పందించింది. కార్లలో ఉండే బెల్ హౌసింగ్ లోపల రబ్బరు బెలో’ ఏం సంస‍్థ తయారు చేసింది. ఏయే తేదీలలో వాటిని తయారు చేశారో గుర్తించి, క్రమబద్దీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వాహనాదారులకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత డీలర్‌ షిప్‌ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని కోరింది. 

నాణ్యతలో రాజీపడం 
అంతేకాదు సంస్థ తయారు చేసే కార్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడమని, అలాగే ప్రస్తుతం కార్లలోని లోపాల‍్ని గుర‍్తించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.   

బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు 
మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల మేరకు..మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో - ఎన్‌లు కార్లు వాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఒక్క ఆగస్ట్‌ నెలలో ఈ రెండు కార్లు సుమారు 2.40 లక్షలు ఓపెన్‌ బుకింగ్స్‌ అయ్యాయని..ఆ బుకింగ్స్‌ చేసుకున్న కార్లు కొనుగులో దారులకు చేరాలంటే 20 నుంచి 24 నెలల సమయం పడుతుందన్నారు. అందుకు మార్కెట్‌లో ఈ కార్లు ఉన్న డిమాండేనని చెప్పారు.

 ఇక ఇదే ఏడాది జులై నెలలో స్కార్పియో ఎన్‌ వేరియంట్‌ లక్ష కార్లను వాహనదారులు బుక్‌ చేసుకోగా.. ట్రాప్‌ - ఎండ్‌ ట్రిమ్‌ కార్ల కోసం 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంది. మిగిలిన వేరియంట్‌ కార్లను కొనుగులో చేసిన కస్టమర్ల దగ్గరికి చేరుకునేందుకు 20-24 నెలల సమయం పట్టనున్నట్లు స్పష్టం చేశారు. 

చదవండి👉 ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్‌ చేస్తాం..అదే కారు కావాల్సిందే’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top