సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..

Mahindra Bolero Neo Goes On Sale In India - Sakshi

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్‌తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్‌లోకి లాంఛ్‌ చేసింది. బొలెరో నియో సబ్‌కంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్‌4, ఎన్‌8, ఎన్‌10, ఎన్‌10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది.   బొలెరో నియో ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది.   

సరికొత్త బొలెరో నియో రివైజ్‌డ్‌ డీఆర్‌ఎల్‌ హెడ్‌ల్యాంప్స్‌, కొత్త ఫ్రంట్‌ బంపర్‌, న్యూ ఫాగ్‌ ల్యాంప్స్‌తో రానుంది. కారు ఇంటీరియల్స్‌ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇనోఫో సిస్టమ్‌ విత్‌ బ్లూటూత్‌ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్‌ ఆడియో కంట్రోల్స్‌, క్రూజ్‌ కంట్రోల్‌, బ్లూ సెన్స్‌యాప్‌తో బొలెరో నియో రానుంది. 

బొలెరో నియో ఇంజన్‌ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో, గరిష్టంగా  100పీఎస్‌ పవర్‌, 260ఎన్‌ఎమ్‌ పీక్‌ టార్క్‌ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్‌ఎమ్‌ టార్క్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్,  రాకీ బీజ్‌ ఆరు రకాల కలర్‌ వేరియంట్లతో రానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top