తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!

Mahima Datla Richest Woman From Telangana, Andhra Pradesh - Sakshi

హైదరాబాద్: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. బయోలాజికల్ ఈ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా దట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఆమె నికర సంపద విలువ రూ.7,700 కోట్లు. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు.

లండన్‌లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తుంది. ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు రూ.1,000 కోట్ల సంపద కలిగి ఉన్నారు.(చదవండి: 10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్)

తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో ఆమె 41వ స్థానంలో ఉండగా.. దాట్లా & కుటుంబం 15 స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top