హైదరాబాద్‌లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు  | Luxury Home Sales Down In Hyderabad, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు 

Jul 12 2025 4:46 AM | Updated on Jul 12 2025 1:41 PM

Luxury Home Sales Down in Hyderabad

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మూడింతలైన అమ్మకాలు 

సీబీఆర్‌ఈ, అసోచామ్‌ సంయుక్త నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి.

 క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్‌ఈ, అసోచామ్‌ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్‌ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. 

→ బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి.  
→ చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి.  
→ పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. 
→ కోల్‌కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. 
→ ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. 
→ పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది.  

స్థిరమైన డిమాండ్‌.. 
‘‘దేశ ఇళ్ల మార్కెట్‌ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్‌లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్‌ కుమార్‌ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్‌ బూమ్‌కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ మనీష్‌ సింఘాల్‌ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement