ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందికిపైగా పైలట్ల నిరసన!

Lufthansa Pilots Union Vereinigung Cockpit Called For The Strike - Sakshi

జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ లుప్థాన్సాకు ఉద్యోగుల సమ్మె మరింత ఉధృతం కానుంది. వచ‍్చే ఏడాది ద్రవ్యోల్బణం కంటే అధికంగా వేతన చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేస్తూ జర్మనీకి చెందిన జర్మన్‌ ఎయిర్‌ లైన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ వెరీనిగుంగ్ కాక్‌పిట్ (వీసీ)గురువారం రాత్రి నుంచి సమ్మెకు పిలుపు నిచ్చింది.ప్రస్తుతం సమ్మె కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది పైలట్లు విధులకు గైర్హాజరైటన్లు తెలుస్తోంది.    

పైలట్ల సమ్మె పిలుపుతో ప్రపంచ వ్యాప్తంగా లుప్థాన్సాకు చెందిన 800 విమానాల రాకపోకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని రోజుల్లో జర్మనీకి చెందిన పలు రాష్ట్రాల్లో సమ్మర్‌ సెలవులు ముగియనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న జర్మన్‌ దేశస్తులకు ఉద్యోగుల సమ్మె మరింత ఆందోళన కలిగిస్తుండగా...ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా లక్షా 30వేల మంది ప్రయాణికులపై పడింది.  

లుప్థాన్సా విమానాల సర్వీసులు రద్దుకావడంతో జర్మనీ ముఖ్య నగరాలైన ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్‌లలో సైతం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికుల్లో గందరగోళం మొదలైంది. ప్రయాణాన్ని రీహెడ్యూల్‌ చేయడం, లేదంటే ట్రైన్‌ జర్నీ చేసేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

పైలట్ల డిమాండ్‌ ఇదే  
గత ఆగస్ట్‌ నెల నుంచి జీత భత్యాల పెంపు విషయంలో జర్మన్‌ పైలట్ల యూనియన్ వెరీనిగుంగ్ కాక్‌పిట్ (వీసీ) లుప్థాన్సాతో చర్చలు జరుపుతుంది. 2023లో ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం నుంచి పైలెట్లు గట్టెక్కాలంటే 5వేల కంటే ఎక్కువ మందికి 5.5శాతం వేతన పెంపును వీసీ డిమాండ్‌ చేసింది. అయితే సీనియర్‌ పైలట్లకు 5శాతం, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 18శాతం పెంచుతామని లుప్థాన్సా యాజమాన్యం ముందుకొచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పైలట్లు సమ్ముకు దిగిన విషయం తెలిసిందే.

చదవండి👉 800 లుఫ్తాన్సా ఫ్లైట్స్‌ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top