విమాన ప్రయాణికులకు అలర్ట్‌.. వాటిని నిషేదిస్తూ కీలక నిర్ణయం!

Lufthansa Airline Officially Banned Apple Airtags - Sakshi

విమాన ప్రయాణానికి యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్స్‌ ప్రమాదం అంటూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్‌ తెలిపింది. అందుకే తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాల్లో యాపిల్‌ ఎయిర్‌ ట్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణంలో తమ వెంట తెచ్చుకున్న లగేజీ సేఫ్‌గా ఉందా? లేదా? అని చెక్‌ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అదే ఎయిర్‌ ట్యాగ్స్‌పై జర్మనీ ఎయిర్‌లైన్‌ ఆంక్షలు విధించింది. అయితే లుఫ్తాన్సా ఇటీవల ‘ఎయిర్‌ ట్యాగ్‌లు ప్రమాదమని.. కాబట్టే యాక్టివేటెడ్ ఎయిర్‌ట్యాగ్‌లను ప్రయాణికుల వినియోగంచుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది.

ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిలియన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాల కారణంగా లుఫ్తాన్సా ఎయిర్‌ట్యాగ్‌ని నిషేధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు, 15 అంగుళాల యాపిల్‌ మాక్‌ ప్రో (సెప్టెంబర్ 2015 ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన)లపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయి.  

యాపిల్‌ సంస్థ లిథియం- అయాన్‌ బ్యాటరీలు వినియోగించదు. ఎయిర్‌ ట్యాగ్స్‌ కోసం యాపిల్‌ సంస్థ సీఆర్‌2032 సెల్స్‌ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఆ సెల్స్‌ ప్రమాదకరమని భావిస్తే స్మార్ట్‌వాచ్‌లను విమానాల్లో అనుమతించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి.  

యాపిల్‌ ఎయిర్‌ట్యాగ్‌పై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్‌ ఎందుకు నిషేధం విధించిందో స్పష్టమైన నిషేధాన్ని కారణాలు వివరించనప్పటికీ, అనేక నివేదికలు మాత్రం ప్రయాణికుల లగేజీని ట్రాక్‌ చేయకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top