ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్‌ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా?

Lucid Air Electric Car Wins MotorTrend Car of the Year Award - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరందుకోవడంతో పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించాయి. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. అయితే, ఒక కంపెనీ తీసుకొచ్చిన మొదటి వాహనం అప్పుడే అవార్డు గెలుచుకుంది. కాలిఫోర్నియాలోని నెవార్క్ కేంద్రంగా పనిచేస్తున్న లూసిడ్ మోటార్స్ తన మొదటి లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును గత నెలలో డెలివరీ చేసింది. "మోటార్ ట్రెండ్" నవంబర్ 15న లూసిడ్ మోటార్స్ సంస్థకు ఎయిర్ సెడాన్ "కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును ప్రదానం చేసింది. 

ఈ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం అప్పుడే అవార్డు గెలుచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియాలోని నెవార్క్ కేంద్రంగా పనిచేస్తున్న లూసిడ్ మోటార్స్ ఇటీవల నేర్సా గ్రాండే, అరిజోనా, అసెంబ్లీ ప్లాంట్ నుంచి కార్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. లూసిడ్‌ మోటార్స్‌ నాస్ డాక్ లో ట్రేడింగ్ ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఈ కంపెనీ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమేకర్లలో ఒకటిగా $72 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. సీఈఓ పీటర్ రాలిన్సన్ కొన్ని సంవత్సరాలు టెస్లా కంపెనీలో పనిచేశారు. 
(చదవండి: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్‌ శేఖర్‌ శర్మ!)

840 కిమీ రేంజ్
ఆ కంపెనీలో అతను మోడల్ ఎస్ కారు రూపకల్పనలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అతను రూపకల్పన చేసిన టెస్లా మోడల్ ఎస్ కారు 2012లో మోటార్ ట్రెండ్ "కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది. లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ వాహనాలు "కొత్త బెంచ్ మార్క్"ను క్రియేట్ చేశాయి. లూసిడ్‌ మోటార్స్‌ ఎయిర్‌ సెడాన్ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 520 మైళ్లు(840 కిమీ) వరకు ప్రయాణిస్తుంది. మోటార్ ట్రెండ్ సమీక్షకులు దాని మొత్తం పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ కారు 1100 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ను ఏర్పాటు చేయడంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌ చేస్తే కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్‌ వెల్లడించింది. 

ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లూసిడ్‌ ఎయిర్‌ డ్రీమ్‌ ఎడిషన్‌ 113కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీను అమర్చారు.  ఈ కారులో డ్యూయల్‌ ఆక్టివ్‌ కోర్‌ మోటార్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కారులో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకుగాను సెమి ఆక్టివ్‌ సప్సెన్షన్‌ను వాడారు. 2021 పోర్స్చే టేకాన్, 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్, 2022 టయోటా జీఆర్86, 2022 హోండా సీవిక్, 2021 హ్యుందాయ్ ఎలాంట్రా కార్లను పనితీరు, రేంజ్ పరంగా ఇతర కంపెనీలను లూసిడ్‌ ఎయిర్‌ ఓడించింది. దీని ధర సుమారు $77,400గా ఉంది.

(చదవండి: అదిరిపోయిన ఎలక్ట్రిక్ కారు.. 700 కి.మీ రేంజ్, ధర కూడా తక్కువే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top