మీ ఆధార్ కార్డ్‌ పోయిందా..అయితే ఇలా చేయండి!

Lost Your Aadhaar Card, Get a New PVC Aadhar Delivered At Home - Sakshi

మన దేశంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ తో అవసరం చాలా ఉంటుంది. కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, చివరికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్ ను ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం ప్రజల సౌలభ్యం కొరకు అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. అయితే, అలాంటి ఆధార్ కార్డు పోతే ఎలా? ఇలాంటి సమయంలో మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ అధికారిక పోర్టల్ నుంచి మీరు పీవీసీ లేదా ప్లాస్టిక్ ఆధార్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు.

పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా:

  • మొదట https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి My Aadharపై క్లిక్ చేయండి.
  • గెట్ ఆధార్ సెక్షన్ మీద ట్యాప్ చేసి Order - Aadhar PVC Card అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి.
  • ఆ తర్వాత క్యాప్చా కోడ్, ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ కు వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయాలి.
  • ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు కోసం రూ.50 డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి.
  • ఆ తర్వాత మీకు వచ్చే ఎస్‌ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి.
  • ఆర్డర్ చేసిన రెండు వారాల తర్వాత మీకు కొత్త పీవీసీ ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top