కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్‌  | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్‌ 

Published Fri, Sep 15 2023 6:29 PM

LIC handed over 831 Crore Cheque to Finance Minister as Dividend - Sakshi

LIC rs1 831 Crore dividend  లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్‌ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్‌ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్‌ను షేర్‌హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్‌ఐసీ పేర్కొంది. (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!)

రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్‌ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్‌ రంగంలోకి ప్రైవేటుపెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్‌ జీవిత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోందని ఎల్‌ఐసీ  ప్రకటన పేర్కొంది. (దిగొచ్చిన చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం)

Advertisement
Advertisement