దేశీయ మార్కెట్‌లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా! | Lg New Rollable Tv Launched In India | Sakshi
Sakshi News home page

దేశీయ మార్కెట్‌లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!

Jun 15 2022 9:19 PM | Updated on Jun 15 2022 9:21 PM

Lg New Rollable Tv Launched In India - Sakshi

సౌత్‌ కొరియా కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్‌లెట్‌లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

ముంబై క్రోమా స్టోర్‌లో ఎల్జీ సంస్థ ఎల్‌ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ హ్యాక్‌ హ్యయిన్‌ కిమ్‌ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. 

టీవీ స్పెసిఫికేషన్‌లు 
టీవీ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, సెల్ఫ్‌ లైట్నింగ్‌ ఫిక్సెల్‌ టెక్నాలజీ, ఎల్‌జీ ఏ9 జనరేషన్‌ ఏఐ ప్రాసెసర్‌, డొల్బే అట్మాస్‌ స్పాటల్‌ సౌండ్‌ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement