
ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా రాజీవ్ ఆనంద్‌ను అధికారికంగా నియమిస్తున్నట్లు బ్యాంక్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. 2028 ఆగస్టు 24తో ముగిసే మూడేళ్ల తన పదవీ కాలం 2025 ఆగస్టు 25 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల జరిగిన రూ.1,960 కోట్ల అకౌంటింగ్ అవకతవకలు నడుమ బ్యాంక్ మాజీ సీఈఓ సుమంత్ కత్పాలియా రాజీనామా చేశారు.
ఎవరీ రాజీవ్ ఆనంద్?
యాక్సిస్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. హోల్‌సేల్ బ్యాంకింగ్, డిజిటల్ ట్రాన్స్‌పర్మేషన్‌కు కీలకంగా వ్యవహరించారు. యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపక ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజీవ్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. క్యాపిటల్ మార్కెట్, యాక్సిస్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్ రయ్
ఇటీవల బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలు, మేనేజ్‌మెంట్ సంక్షోభం తర్వాత ఈమేరకు నియామకం చేపట్టడం కీలకంగా ఉంది. ఇన్వెస్టర్లు, ఖాతాదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం, కార్యకలాపాల స్థిరీకరణ కొత్త బాస్ ముందున్న సవాళ్లు. దశాబ్ద కాలంలో ఇండస్‌ఇండ్ తన లీడర్‌షిప్ బెంచ్‌లో నుంచి కాకుండా బయటి వ్యక్తులను సీఈఓగా నియమించడం ఇదే తొలిసారి.