పుల్లెల గోపిచంద్‌ అకాడమీతో పనిచేయనున్న కోటక్‌ బ్యాంక్‌

Kotak Karma And Gopichand Academy Celebrate The Mettle Of Women Athletes - Sakshi

సాక్షి, హైదరాబాద్: టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందం సిద్ధమవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎమ్‌బిఎల్), పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (గోపిచంద్ అకాడమీ) సంయుక్తంగా ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే మహిళా అథ్లెట్లలో స్పూర్తిని నింపడమే  ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశ్యం.  

భారత అత్యుత్తమ మహిళా అథ్లెట్లకు, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని కలలు కనే యువతులందరికీ ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ ప్రత్యేక సందేశాన్ని అందిస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2010లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప, సౌత్‌ ఏసియన్‌ గేమ్స్‌-2016లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఎన్‌. సిక్కిరెడ్డి ప్రచార వీడియోలో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఒక నిమిషంపాటు ఉన్న ఈ వీడియోలో.. తమ కలలను అనుసరించే యువతులను గౌరవించడంతోపాటు, వారి కలలను నిజం చేయడానికి కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది. 

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాయింట్ ప్రెసిడెంట్ & గ్రూప్ చీఫ్ సిఎస్ఆర్ ఆఫీసర్ రోహిత్ రావు మాట్లాడుతూ... కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సామాజిక బాధ్యతగా భావించి కోటక్‌ కర్మను ప్రకటించాము. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది. ఆధునాతన మౌలిక సదుపాయాలను, ఆత్యాధునిక బాడ్మింటన్‌ శిక్షణా సదుపాయాలను కోటక్‌ కర్మ అభివృద్ది చేసింది. క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలను కల్పిండంతో భారత్‌ను క్రీడా రంగంతో గర్వించదగిన దేశంగా చూడవచ్చునని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top