వావ్! ఎలక్ట్రిక్ వెహికల్‌గా..లూనా మళ్లీ వచ్చేస్తోంది!

న్యూఢిల్లీ: చిన్న బండి లూనా గుర్తుంది కదూ. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ మోపెడ్ కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ లూనా రూపంలో వస్తోంది. కినెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ దీనిని ప్రవేశపెట్టనుంది. చాసిస్, ఇతర విడిభాగాల తయారీ ఇప్పటికే మొదలైందని కినెటిక్ గ్రూప్ ప్రకటించింది.
నెలకు 5,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రత్యేక యూనిట్ సైతం అహ్మద్‌నగర్ ప్లాంటులో ఏర్పాటైంది. లూనా అమ్మకాల ద్వారా వచ్చే 2–3 ఏళ్లలో ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని కినెటిక్ ఇంజనీరింగ్ ఎండీ ఆజింక్యా ఫిరోదియా తెలిపారు.