ఎన్‌టీఎఫ్‌లలో కేజీఎఫ్‌ 2 హవా

KGF 2 NFTs Get Huge Response Said By Producers Hombale Films - Sakshi

కేజీఎఫ్‌ సినిమాతో హీరో యాష్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు అందులో పాత్రలకు ప్రత్యేకంగా ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దీంతో కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు, కేజీఎఫ్‌వెర్స్‌ను నిర్మాతలు అందుబాటులోకి తెచ్చారు.

కేజీఎఫ్‌ సినిమాలో కీలకమైన ఎల్‌డోరాడో క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకుని పది వేలకు పైగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లను (ఎన్‌ఎఫ్‌టీ) మార్కెట్‌లో రిలీజ్‌ చేయగా కేవలం గంట వ్యవధిలోనే ఐదు వందల ఎన్‌ఎఫ్‌టీ టోకెన్లు అమ్ముడయ్యాయి.ఇప్పటి వరకు రెండు వేలకు పైగా టోకెన్లు అమ్ముడైపోయాయి.

వివిధ రకాలైన కళలకు డిజిటల్‌ రూపమే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ ఎన్‌ఎఫ్‌టీ లావాదేవీలు జరుగుతుంటాయి. మిగిలిన టెక్నికల్‌ రూపాలకంటే కూడా ఎన్‌ఎఫ్‌టీలలో భద్రత అధికం. ఈ ఎన్‌ఎఫ్‌టీ టోకెన్లను భవిష్యత్తుల అమ్ముకోవచ్చు కూడా. కేజీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌టీ టోకెన్లు సొంతం చేసుకున్న వారు వాటి సాయంతో కేజీఎఫ్‌వర్స్‌లోకి (మెటావర్స్‌)లోకి వెళ్లి వర్చువల్‌ 3డీ వరల్డ్‌లో కేజీఎఫ్‌లోని అద్భుతాలను చూసే అవకాశం ఉంది.

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ విస్త్రృతమైన తర్వాత సినిమాల ప్రమోషన్లలో ఎన్‌ఎఫ్‌టీలు కూడా ఓ భాగమయ్యాయి. అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌గోపాల్‌ వర్మ వంటి వారు ఇప్పటికే ఈ రంగంలో అడుగు పెట్టారు.  రాధేశ్యామ్‌ ట్రైలర్‌ని మెటావర్స్‌లో రిలీజ్‌ చేశారు. ఈ పరంపరలో  కేజీఎఫ్‌ నిర్మాతలు సైతం ఎన్‌ఎఫ్టీల రూపంలో ఈ కొత్త ప్రచారానికి ముందుకు రాగా మంచి స్పందన వచ్చింది.

చదవండి: సింగర్‌ కార్తీక్‌ తొలి అడుగు.. సౌత్‌ ఇండియాలోనే ఫస్ట్‌ మెటావర్స్‌ కాన్సెర్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top