స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌

Kenya Police Department Using Scorpio Vehicle Anand Mahindra Tweet goes Viral - Sakshi

ఇటీవల ఓ నెటిజన్‌ నువ్వు పంజాబీవా అడిగితే కాదు ఇండియన్‌ అంటూ సమాధానం ఇచ్చి భారతీయుల మనుసు గెలుచుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్లు మరోసారి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

దేశీ కార్ల తయారీ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న మహీంద్ర మరో ఘనత సాధించింది. మహీంద్రా వాహనాల పనితీరు నచ్చడంతో కెన్యా ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. వందకు పైగా సింగిల్‌ క్యాబ్‌ పికప్‌ స్కార్పియోలను కొనుగోలు చేసి వాటిని కెన్యా రాజధాని నైరోబీ పోలీసు విభాగానికి అప్పగించింది. 

కెన్యా పోలీసు డిపార్ట్‌మెంట్‌ మహీంద్రా వెహికల్స్‌ని ఉపయోగించడంపై ఆనంద్‌మహీంద్రా స్పందించారు. నైరోబీ పోలీసు శాఖలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్కార్పియో వాహనం ఓ బీస్ట్‌ లాంటిదంటూ తమ ప్రొడక్టుని పొగిడారు.

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు విదేశీ కార్లను ఇండియా దిగుమతి చేసుకుకేది. ఇప్పుడు మహీంద్రా బ్రాండ్‌ కింద మన కార్లు విదేశాల్లోకి వెళ్తున్నాయి. మహీంద్రా గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలని కోరుకుంటున్నామని నెటిజన్లు  అంటున్నారు. భారతీయులు గర్వించేలా చేశారు ఆనంద్‌ మహీంద్రా అంటూ ట్వీట్లతో హోరెత్తెస్తున్నారు.
 

 

చదవండి: నెటిజన్‌ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top