జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్

JioFiber users can now access Discovery Plus content Free - Sakshi

జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. భారత్ లో అత్యంత ప్రజాదరణ గల డిస్కవరీ ప్లస్ కంటెంట్‌ను జియో తన ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్‌ను జియోఫైబర్ వినియోగదారులు ఉచితంగా ఆస్వాదించవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషలలో కంటెంట్ అందిస్తుంది. 

కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్‌తో సహా ఇతర డిస్కవరీ నెట్‌వర్క్  ప్రీమియం షోలు యాక్సెస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన కంటెంట్ చూడవచ్చు. వీటితో పాటు జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ IX1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్‌లైన్, సూపర్ సోల్, లడఖ్ వారియర్ తదితర సిరీస్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే జియో 14 సంస్థలకు చెందిన ఓటిటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంది. ఇప్పడు ఆ జాబితాలో డిస్కవరీ ప్లస్ వచ్చి చేరింది.

చదవండి:

ఈ బ్యాంకు పాస్​బుక్​, చెక్​బుక్​లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top