గ్లాన్స్‌లో జియో భారీ పెట్ట‌బడులు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ముఖేష్ అంబానీ!

Jio Invests 200 Mn In Ai Powered Lock Screen Platform Glance - Sakshi

ప్ర‌ముఖ దేశీయ టెలికాం దిగ్గ‌జం జియో ప్లాట్‌ఫారమ్ ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ ప్లాట్‌ఫారమ్ గ్లాన్స్‌లో 200 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. త‌ద్వారా ఇంట‌ర్నేష‌నల్ మార్కెట్‌ల‌పై  ప‌ట్టు సాధించాల‌ని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.  

జియో గ్లాన్స్ సాయంతో  యూఎస్‌, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి అనేక కీలక అంతర్జాతీయ మార్కెట్లలో గ్లాన్స్ లాంచ్‌ను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ప‌లు నివేదికలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇక గ్లాన్స్ సైతం జియో పెట్టిన పెట్టుబడుల‌ను లాక్ స్క్రీన్‌పై ప్రపంచంలోనే ప్లైవ్ కంటెంట్, కామర్స్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని, ప్ర‌పంచ వ్యాప్తంగా సేవ‌ల్ని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది.

ఈ పెట్టుబ‌డుల సంద‌ర్భంగా..గత రెండేళ్లలో గ్లాన్స్ అసాధారణ వేగంతో వృద్ధి చెందింది.ఇంటర్నెట్, లైవ్ కంటెంట్, క్రియేటర్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, వాణిజ్యం, గేమింగ్ను ఎంజాయ్ చేసేందుకు లాక్ స్క్రీన్‌లో ఇంటర్నెట్ వినియోగించేందుకు యూజ‌ర్ల‌కు ప్ర‌త్యేక అనుభూతిని క‌లిగిస్తుంద‌ని జియో ప్లాట్‌ఫారమ్  డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top